సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం.

ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై27(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థ లో పనిచేస్తున్న వీఆర్ఏలకు 2020 సెప్టెంబర్ 12 తేదీన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారి సమస్య పరిష్కారం అయ్యే దాకా సమ్మెను కొనసాగిస్తామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత డిమాండ్ చేశారు.బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు జరిగిన మూడో రోజు జరిగిన వీఆర్ఏ ల సమ్మెను ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు కందికొండ గీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది వీఆర్ఏల కు పే స్కేల్ అమలు చేస్తానని వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తానని మాట ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఇరవై రెండు నెలలు కావస్తున్నా ఆ యొక్క హామీని అమలు చేయకుండా వీఆర్ఏల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు.రెవెన్యూ వ్యవస్థ లో అతి తక్కువ వేతనంతో జీవిస్తున్నారని వీరంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీనవర్గాలకు ఎక్కువగా ఉన్నారని వీరంతా వెట్టిచాకిరి చేస్తున్నారని ఆయన అన్నారు.20 రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు వారి సమస్యల పట్ల ముఖ్యమంత్రి ఏమాత్రం స్పందించకుండా సాగ వేత ధోరణి అవలంభిస్తున్నారని ఆమె అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారి సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ జిల్లా కో కన్వీనర్ కాజా బాను మండల జేఏసీ అధ్యక్షులు నిరంజన్ బంగారయ్య బాలస్వామి జ్యోతి కాసిం కృష్ణయ్య వెంకటయ్య సుశీల అలివేల తదితరులు పాల్గొన్నారు.