సమాజంపై అవగాహన ఎంతో అవసరం
పెద్ద శంకరంపేట జనం సాక్షి అక్టోబర్ 21
నేటి పరిస్థితుల్లో విద్యార్థినులు సమాజంపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండలని మహిళా శక్తి కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ కవిత అన్నారు శుక్రవారం పెద్ద శంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సమాజం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ముఖ్యంగా చిన్న వయసులో వివాహాలు చేసుకోవద్దని అలా చేస్తే చిన్న వయసులో బిడ్డలు పుట్టి ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుందని అన్నారు విద్యార్థులు ఫోన్ వాడకం చాలా తక్కువ చేయాలని అన్నారు విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని అన్నారు మనం జీవితంలో స్థిరపడ్డాకనే వివాహం చేసుకుంటే ఆ కుటుంబం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు కిశోర బాలికలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రల ద్వారా మంచి పోషకాహారం అందిస్తున్నారని దానిని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పిల్లలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా వారికి సమాజం పట్ల ఎలా ఉండాలో అని విషయాలపై కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు అత్యవసర సమయంలో మహిళలు చైల్డ్ వెల్ఫేర్ నెంబర్ 1098, సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు అలాగే మహిళలు తమ రక్షణ కోసం 1081 నెంబర్ కు ఫోన్ చేసి తమ పరిస్థితిని వివరించి వారి నుండి సహాయం పొందవచ్చని ఆమె పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని తల్లులకు కూడా పోషకాహారాన్ని అందిస్తున్నాయని పేర్కొంటూ ఇంటి వద్ద ఉన్న చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపే విధంగా విద్యార్థులు బాధ్యత తీసుకోవాలని అన్నారు పౌష్టికాహార విషయమై తల్లులకు అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయుని సరళ స్వరూప కళాశాల ప్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు