సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ – ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు

తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేని ఉద్యమ కారుడు, తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొపెసర్ జయశంకర్ 11వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ప్రొపెసర్ జయశంకర్ చిత్ర పటానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని తెలంగాణ సమాజానికి అవగాహన కల్పించడంతో పాటు మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా కొనసాగుతూ గల్లీ నుండి ఢిల్లీ దాకా రాజకీయ పక్షాలన్నింటినీ ఒప్పించడంలో కీలక భూమిక వహించిన ప్రొఫెసర్ జయశంకర్ ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువ లేదని ఆయన అన్నారు. అలాగే  ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ప్రొపెసర్ జయశంకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని, మలి దశ ఉద్యమనికి మార్గానిర్దేశం చేసి తెలంగాణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఆచార్య జయశంకర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవింద్ రావు, జడ్పీటీసీ హరిప్రియ, దోమ జడ్పీటీసీ కే. నాగి రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, దోమ పిఏసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పరిగి పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ శివనోళ్ల భాస్కర్, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తెరాస సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
———–