సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం
సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం
మంథని, (జనంసాక్షి ) : సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించాలని స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంథని రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ హనుమ నాయక్ కు నామినేషన్ సమర్పించడం జరిగిందని, అందరూ అభివృద్ధి చెందాలంటే ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరగాలని, ఒక్క ఐదు సంవత్సరాల నాకు అధికారం ఇస్తే, అందరి సమన్వయంతో మంత్రం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని, బీసీ బహుజన రాజ్యాధికారం రావాలంటే, సామాన్యులైన సమాజ సేవకులు కావాలని ఆయన తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఓటు వేసి సమా సమాజ స్థాపనకు కృషి చేయాలని, మంథని అభివృద్ధి కోసం ఒక్క ఓటు నాకేసి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని, ఇప్పటికి మూడుసార్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, గతంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వచ్చే ఎన్నికల్లో సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూనె రామచందర్, తోడేటి కనకయ్య, నూనె సంపత్, ముసుకుల సతీష్, రాచర్ల రాకేష్, చిట్టి మల్లయ్య, కలవేన సంపత్, పులిపాక రామ చందర్, పొన్నం శ్రీనివాస్, వనం శేషగిరిరావు, కొక్కుల గణేష్, నూనె మల్లేశం, బత్తుల శంకర్, సాగర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.