సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఆదర్శవంతులు
ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ ,జులై 7 (జనంసాక్షి ) :
సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పట్టణం బ్రాహ్మణవాడిలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం, యశోద హాస్పిటల్స్ మలక్ పేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల అనేకమంది నిరుపేదలకు స్థానికంగానే మంచి వైద్యం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ జనరల్ దవాఖాన ద్వారా అత్యధిక సూపర్ స్పెషాలిటీ వైద్యం స్థానికంగానే అందుబాటులోకి వచ్చేలా చేసామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి నాగరాజు, ప్రమోద్ కుమార్, చక్రధర్ గుప్తా, గుద్దేటి వెంకటరమణ ప్రభు లింగం తదితరులు పాల్గొన్నారు.