సమావేశంలో మాట్లాడుతున్న రామానుజరెడ్డి
-పోలీస్ వ్యవస్థ లేకుంటే సమాజం అస్తవ్యస్థం
మహబూబాబాద్, నవంబర్ 18(జనంసాక్షి):
చట్టం, న్యాయం, ధర్మం పరిరక్షించబడుతున్నాయంటే అది పోలీస్ వ్యవస్థతోనే సాధ్యమని పోలీసు శాఖ లీగల్ అడ్వయిజర్ రామానుజరెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టౌన్ పోలీస్‌స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల దృష్ట్యా, ఎన్నికల సమయంలో వర్తించే చట్టాలను ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై పోలీసులకు అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థ లేకుంటే సమాజం మొత్తం అస్థవ్యస్తంగా మారిపోతుందన్నారు. పోలీసులు తమ వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో జిల్లాలో శాంతిభత్రలకు భంగం వాటిల్లకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీలు నరేష్‌కుమార్, మదన్‌లాల్, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.