సమావేశాలు సజావుగా జరగనివ్వండి

3

– అఖిలపక్షానికి మోదీ వినతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టారు. మంగలవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలో మోదీ సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలను కోరారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు విూడియాతో మాట్లాడుతూ… జేఎన్‌యూ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ప్రధాని కోరారని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ప్రజల సంక్షేమం కోసం చర్చలో పాల్గొనాలని అన్నారు. సమావేశాలు సజావుగా సాగేలా చూడాలన్నారు. పార్లమెంట్‌ సజావుగా జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని లోక్సభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు.  అఖిలపక్ష సమావేశం అనంతరం మేకపాటి విలేకర్లతో మాట్లాడారు. సభలో ఏ సమస్యనైనా చర్చించడానికి సిద్ధమని ప్రధాని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారని మేకపాటి తెలిపారు. పార్లమెంట్‌ ద్వారానే సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేకపాటి డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ¬దాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమని మేకపాటి పునరుద్ఘాటించారు.