సమీకృత తెగులు నిర్వహణ
గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా లయోల కళాశాల విద్యార్దులు గరిడేపల్లి గ్రామంలో ఆదివారం వరి పంటలో ఆశించే చీడ పీడలు నిర్వహణ యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు విచక్షణ రహితంగా మందులను పిచికారీ చేయడం ద్వారా మేలు చేసే మిత్ర పురుగులు నశిస్తాయని తద్వారా మళ్ళీ మళ్ళీ మందుల పిచికారీ చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రస్తుతం వరి వివిధ దశలలో ఉన్నదని పంటను ఆశించే అగ్గి తెగులు ఎండు అకు తెగులు పొట్టకుల్లు తెగులు కాండం తొలిచే పురుగు ఆకు చుట్టు పురుగు ఉల్లికోడు మొదలగు పురుగులను గమనించి వాటి యొక్క ఆర్థిక నష్ట పరిమితిని ననుసరించి మాత్రమే సూచించిన మోతాదులో తెగుళ్ల పురుగు మందులు పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎలుకల యాజమాన్యం వాటి వల్ల కలిగే నష్టాలు ఎలుకల నివారణ పద్ధతుల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో రైతులు వెంకట్ రెడ్డి, గుడ్ల శ్రీను, కన్నయ్య, సైదులు లయోలా కళాశాల విద్యార్థినులు నీరజ ,జ్యోతిక, మానస, గ్రీష్మ , రాణి, సంధ్య ,అఖిల లు పాల్గొన్నారు.