సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సర్పంచ్ బట్టు శ్రీనివాస్
కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి / ఆదివారం రోజున మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆత్మీయులతో కలిసి మేడారంలోని సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆత్మీయులతో కలిసి వన దేవతలను దర్శించుకోవడం జరిగిందన్నారు.ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నామని తెలియజేశారు.ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్,భద్రకాళి దేవాలయ ధర్మకర్త వీరన్న,కోఆప్షన్ సభ్యులు నజ్జు,బ్రాహ్మణ పెళ్లి చిట్టి,రజాక్, హనుమయ్య, సుధాకర్,బాల మోహన్, శివ, సోమేశ్వర్,పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.