సమ్మె విరమించిన లారీ యజమానులు
రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో లారీ యజమానుల సంఘం ప్రతినిధుల చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన.. లారీ యజమానులు ఇవాళ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారానికి సర్కార్ హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు లారీ యజమానులు తెలిపారు. వాహనపు పన్ను తగ్గింపు, సింగిల్ స్టేట్ పర్మిట్ జారీ అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి మహెందర్‌రెడ్డితో పాటు హరీష్‌రావు పాల్గొన్నారు.