సరిహద్దులో ఉద్రిక్తతను భారత్‌ మీడియా రెచ్చగొడుతోంది

విపక్షాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయి
చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం
సంయమనం పాటించాలని  చైనా అధికారపత్రిక
గ్లోబల్‌ టైమ్స్‌ కథనం
బీజింగ్‌, (జనంసాక్షి) : భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతను భారతీయ మీడియా రెచ్చకొడుతోందని చైనా జాతీయ దినపత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ గురువారం ఓ ప్రత్యేక కథనం వెలువరించింది. భారత మీడియా బాధ్యతా రాహిత్యంతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. చైనాలోని విపక్షాలు కూడా ఈ విషయంలో అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది. ఇరు దేశాల ప్రజలు, అధికార యంత్రాంగం, మీడియా సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. లడాఖ్‌లోని దెప్సాంగ్‌ లోయ నుంచి తమ దేశ దళాల ఉపసంహరణకు గడువు ఉపసంహరణపై ఎలాంటి నిర్దిష్టమైన గడువునూ   మిగతా 2లోఆ పత్రిక పేర్కొనలేదు. లడాఖ్‌లోని దౌలత్‌ ఓల్డీ ప్రాంతంలో వేసిన గుడారాలు ఎన్నాళ్లుంటాయో కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ అంశంపై సంపూర్ణ, సరైన అవగాహనకు వచ్చేందుకు భారత్‌, చైనా బృందాలు చర్చలు జరుపుతున్నాయని తెలిపింది. వాస్తవాదీన రేఖ వెంబడే ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, ఇరు దేశాలు సంయమనం పాటించాలని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. సరిహద్దు సమస్య సంప్రదింపులతోనే పరిష్కారమవుతుందని తెలిపింది.