సర్కారీ దవాఖానలంటే జనం రావాలి

5

– సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

హైదరాబాద్‌,ఫిబ్రవరి 24(జనంసాక్షి):   వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ అంచనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులతో సీఎం చర్చించారు.  సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ వినోద్‌, సీఎస్‌ రాజీవ్‌శర్మ, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… సర్కార్‌ దవాఖానకే పోయి వైద్యం చేయించుకుంటామనే పరిస్థితి రావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందాల్సిన అవసరం ఉంది. వైద్య, ఆరోగ్యశాఖ కోరినన్ని నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్‌ ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగుకావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ ఇతర పోస్టులకు వందశాతం పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అవసరమనుకున్న పోస్టులకు మంజూరు చేస్తాం. అన్ని వైద్యశాలల్లో అవసరమైన రోగ నిర్దారణ పరికరాలు కొనుగోలు చేస్తామని, మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.  ఈ భేటీ కంటే ముందు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. బడ్జెట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా శాఖల అధికారులతో సవిూక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

పర్యావరణ ప్రభావ రుసుము మార్గదర్శకాల జారీ

భవన నిర్మాణాల కోసం పర్యావరణ ప్రభావ రుసుము మార్గదర్శకాలను జారీ చేశారు. 10వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణం మించిన భవనాలకు రుసుం పెంచారు.విస్తీర్ణం మించిన భవనాలకు చదరపు అడుగుకు రూ.3చొప్పున రుసుం నిర్ధారించారు. భవన నిర్మాణ ప్రదేశం, పార్కింగ్‌, ఇతర ప్రదేశాలకు రుసుం చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వెంచర్లకూ పర్యావరణ ప్రభావ రుసుము చెల్లించే అవకాశం. ఇటీవలే నిర్మాణాలు పూర్‌ఖ్తెన భవనాలకు పర్యావరణ ప్రభావం రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది.