సర్కారీ బ్యాంకులు మెరుగుపడాలి

1

– రఘురామరాజన్‌ సంచలన వ్యాఖ్యలు

ముంబై,ఆగస్టు 16(జనంసాక్షి): ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనను మెరుగుపర్చాలని ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు.  తీవ్రమైన పోటీ వాతావరణం నేపథ్యంలో ఆసక్తి, కొత్త టెక్నాలజీ, సమాచారం కొత్త బిజినెస్లకు, కస్టమర్లకు అవకాశంగా మారుతున్నందున్న లాభదాయకత, అనిశ్చిత పరిస్థితులను సైతం తట్టుకునే విధంగా ఛాలెంజింగ్‌ అవసరమని చెప్పారు. ఈ బ్యాంకుల్లో టాప్‌ ఎగ్జిక్యూటివ్లను, నాన్‌-అఫిషియల్‌ డైరెక్టర్లను నియమించే అధికారం బ్యాంకు బోర్డు బ్యూరో(బీబీబీ)కే వదిలివేయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను, ఇతర బోర్డు సభ్యులను ప్రభుత్వమే నియమిస్తూ వస్తోంది. భారత బ్యాంకుల్లో పాలన అంశాలను పరిశీలించేందుకు ఆర్బీఐ నియమించిన పీజే నాయక్‌ కమిటీ ప్రతిపాదనలకే రాజన్‌ కూడా మొగ్గుచూపుతూ వాటిని అమలుచేసే విధంగా సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనను, మేనేజ్మెంట్‌ను మెరుగుపర్చేందుకు సమాంతరంగా చర్యలు చేపట్టాలని రాజన్‌ చెప్పారు. ఎఫ్‌ఐసీసీఐ-ఐబీఏ బ్యాంకింగ్‌ సెమినార్లో రాజన్‌ మంగళవారం ప్రసంగించారు. బ్యాంకుల్లో టాప్‌ ఎగ్జిక్యూటివ్లను, నాన్‌-అఫిషియల్‌ డైరెక్టర్లను నియమించే తుది నిర్ణయం బ్యాంకు బోర్డుకే వదిలివేయాలని, ఎంపిక పక్రియలో బీబీబీ పూర్తి అనుభవం పొందిందని రాజన్‌ చెప్పారు. మాజీ కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వినోద్‌ రాయ్‌ నేతృత్వంలో బీబీబీను ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియమించే ఎగ్జిక్యూటివ్ల అపాయింట్మెంట్లను బీబీబీ షార్‌ట్లిస్టు చేస్తుంది. అనంతరం దీనిపై తుదినిర్ణయం ప్రభుత్వం చేపడుతుంది. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో కొత్త బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని రాజన్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికరంగంలో ఆసక్తి, లాభదాయకతతో పాటు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.