సర్కారు బడి… ఓ సమస్యల సుడి
కరీంనగర్‌్, ఆగస్టు 3 (జనంసాక్షి) : సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు రక్షిత మంచినీరు, మూత్రశాలల నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం నుండి ఆర్వీఎమ్ ఆధ్వర్యంలో కోట్లాది రూపా యలు జిల్లాకు వచ్చినా వాటిని వినియోగం చేయకపోవడంతో జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో మౌలిక వసతులు కరువ య్యాయి. ఉన్న వాటిని పరిశుభ్రంగా ఉంచుకొనే విషయం లోనూ విమర్శలు ఎదుర్కొంటుంది. విద్యార్థులే టాయ్‌లెట్‌లను శుభ్రం చేసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విద్యా శాఖ కార్యదర్శి చందనాఖాన్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. దీం తో ప్రభుత్వం ఆమెను టూరిజం శాఖకు బదిలీ చేస్తూ ఉత్త ర్వులులు జారీ చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర కు అన్ని పాఠశాలలో మౌళిక వసతులను కల్పించాలని ఒత్తిడిని తెస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాగునీటి కోసం కేంద్రం ‘జలమణి’ పేరుతో శుద్ధ నీరును అందించేం దుకు టాంకులు నిర్మించడానికి నిధులు అందించి పరికరాలను సరఫరాచేసినప్పటికీ అవి నిరుపయోగంగా మిగిలిపోయాయి. జిల్లాలోని 600కు పైగా సర్కార్ పాఠశాలలో వేల మంది విద్యా ర్థులు విద్య నభ్యసిస్తున్నారు. వీరికోసం ప్రత్యేక వసతులు కల్పి స్తామని హామీ ఇచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ తమ హామీని నెరవేర్చలేదు. బాలికలకు ప్రత్యేక మూత్రశాలలు లేక పోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కరీంన గర్‌తోపాటు జిల్లాలోని డివిజన్‌లు, వివిధ పట్టణాలైన జగి త్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిిరిసిల్ల, వేములవాడ, హుజురా బాద్, గోదావరిఖని, మంథనిలలోని స్థానిక ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు ఉన్నప్పటికీ సగానిపైగా నిరుపయోగంగా మారా యి. మారుమూల ప్రాంతాలైన కాటారం, ముత్తారం, మల్హర్, మహదేవపూర్, ఎల్లారెడ్డిపేట్, గంభీరావుపేట్, ముస్తాబాద్, కోనరావుపేట తదితర మండల కేంద్రాలతో పాటు ఈ ప్రాం తంలో గల గ్రామాల్లోని పాఠశాల్లో మౌళిక వసతుల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూత్రశా లలను, రక్షిత మంచినీటిపథకాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఆర్వీఎమ్ పైన ఎంతైనా ఉంది.