సర్టిఫికేట్ ల కోసం పోలీస్ అభ్యర్ధుల అవస్థలు

పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్ధులు పార్ట్ 2 అప్లికేషన్ లో సమర్పించాల్సిన   ధ్రువపత్రాల కోసం తాహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాన్ క్రిమి లేయర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లు తాహసీల్దార్ దృవీకరించి  ఇవ్వాల్సి ఉంది.  అయితే జిల్లాలో చాలా మండలాల్లో లాయర్ నోటరీ లేకుండానే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ లు ఇతర ధృవ పత్రాలను ఆధారంచేసుకొని  ఇస్తున్నారు. కానీ గరిడేపల్లి మండలంలో మాత్రం లాయర్ నోటరీ కావాలని చెప్పడంతో అభ్యర్ధులు నోటరీ కోసం హుజూర్ నగర్, మిర్యాలగూడ, సూర్యపేట లకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. రెసిడెన్సీ సర్టిఫికెట్ కోసం కూడా నోటరీ కావాలంటూ తాహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కొత్త తిరకాసు పెట్టారు. మొన్నటి వరకు లాయర్ నోటరీ లేకుండానే చాలా మంది అభ్యర్ధులకు రెసిడెన్సీ సర్టిఫికెట్ లు ఇచ్చారు. కానిస్టేబుల్ ఎస్సై అప్లికేషన్ లు చివరి తేదీ సమీపిస్తుండడంతో  నోటరీ కావాలని కొత్త తిరకాసు పెట్టడంతో పోలీస్ అభ్యర్ధులు లబోధిబోమంటున్నారు. ఈ నెల 10తో కానిస్టేబుల్ ఎస్ఐ దరఖాస్తు తేదీ ముగుస్తుంది. ఇది కాక గత 4, 5 రోజులుగా తహసీల్దార్ ఇతర అధికారులు కలెక్టరేట్ మీటింగ్ లు ఇతర పనుల మీద బయటికి వెళ్లడంతో వందల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మా పని ఒత్తిడులు మాకున్నాయంటున్న తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది చెప్తున్నా చివరికి ఇబ్బందులు పడుతున్నది ప్రజలే కదా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజావార్తలు