సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన గౌడ సంఘం నాయకులు*
కెసిఆర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం*
*గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (3):* హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడంపై మండలంలోని అన్ని గ్రామాల గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో సీఎం కేసీఆర్ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు పలుస శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు గుండ్రాతి రాజేష్ గౌడ్ లు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడం బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న కు సముచితమైన గౌరవం ఇచ్చినందుకు యావత్ తెలంగాణ గౌడ జాతి తరపున తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవ తీసుకొని గౌడ కులస్తుల పట్ల ప్రేమ చూపాలని వెంటనే గౌడ కులస్తులకు కల్లుగీత కార్మిక కార్పొరేషన్ నిధిని ఏర్పాటు చేయాలని, గీత కార్మికులు కల్లూరు తినేయంగా భావించి బ్రతుకుతెరువు కొనసాగిస్తున్న గీత కార్మికులను గుర్తించి ప్రమాదంలో మరణించిన వారికి పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వయసుతో సంబంధం లేకుండా గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని, ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే వనపర్తి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలు మంత్రి నిరంజన్ రెడ్డి సహకారం తో ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాబుగౌడ్, జిల్లా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివప్రసాద్ గౌడ్, మండల జాయింట్ సెక్రెటరీ నాగరాజుగౌడ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు హనుమంతు గౌడ్, మండల తెరాస పార్టీ అధ్యక్షులు గాజుల కోదండం, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు మతిన్, బాలరాజు, కాశీనాథ్, మన్యం నాయక్, వడ్డేమాన్ రవి, నాగరాజు, పులేందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు