సర్పంచి ఫోన్ చేస్తే స్పందించని ఎంఈఓ
ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంచి విద్యను అందించాలనే ఒక ఆలోచనతో సంకల్పంతో పని చేస్తుంటే తండాలలో చదువు రాని వారికి విద్యకు దూరంగా ఉన్న తండాలకు విద్యనందిస్తుంటే మరోపక్క విద్య శాఖకు సంబంధించిన ఎంఈఓ ఫోన్ కాల్ చేస్తే స్పందిస్తలేరని మొర్రపురు సర్పంచి దేవేందర్ ఆరోపణ చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి కరోనా సమయంలో విద్యకు దూరమైన పిల్లలు ఇప్పుడిప్పుడే విద్యకు దగ్గరవుతున్న సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకుంటూ పిల్లల చదువుకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొర్రపురు గ్రామ తండాలో 27 మంది విద్యార్థులు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు పనిచేస్తున్నారు ఎప్పటికీ ఒక్కరు లీవ్లపై వెళ్లడం జరుగుతుంది లీవ్ పై వెళ్లినప్పుడు మాత్రం పాఠశాలో ఆటపాటల్లో మునిగిపోతున్నారు ఇది మొర్రపూర్ ప్రభుత్వ పాఠశాల దృష్టి వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని మొరపురు సర్పంచి దేవేందర్ కోరుతున్నారు
