‘సర’ కుట్రలు తెలంగాణలో సాగనివ్వం

` ఎసఐఆర్‌తో రాష్ట్రంలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారు
` దీనిని అందరం కలసికట్టుగా ఎదుర్కోవాలి
` మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
` మÖసీ అభివృద్ధిలో గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారాల నిర్మాణం
` దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్‌ను తెలియజేసేలా కట్టడాలు ఉండాలి
` ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నైపుణ్య శిక్షణాభివృద్ధి కోర్సులతో డిగ్రీ కళాశాలలు
` మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహాకాలు
` మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
` హజ్ యాత్ర బస్సు ప్రారంభించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి):ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎసఐఆర్) పేరుతో తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇతర రాష్టాల్లో జరిగిన విధంగా తెలంగాణలో జరగనీయవద్దని, అందరూ కలిసి కట్టుగా ఎదుర్కోవాలని మైనారిటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హజ్ వెళ్తున్న బస్సులకు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సంక్షేమం, ఉద్యోగాల్లో మైనారిటీల వాటా వారికి ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇరాన్, ఇరాక్ యుద్ధంతో పెరిగిన విమాన ఛార్జీల భారం హజ్ యాత్రికులపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. గతేడాది హజ్‌కు వెళ్లిన బస్సు ప్రమాదంలో 44 మంది మరణిస్తే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చినట్లు ప్రస్తావించారు. ప్రస్తుతం వైట్ కాలర్ జాబ్స్ కంటే బ్లూ కాలర్ జాబ్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందన్న సీఎం, అమెరికా కంటే జర్మనీ, జపాన్‌లో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. అందుకే ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌లో చాలా మంది మైనారిటీలు ఆటోలు నడుపుతున్నారని, ఓఆరఆర్ లోపల ఉన్న అన్ని ఆటోలను ఉచితంగా ఈవీ ఆటోలుగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమకు హిందూ, ముస్లిం బేధాభిప్రాయం లేదని, హిందూ, ముస్లిం భాsTÖభాsTÖ అని సీఎం అన్నారు. కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు మైనారిటీ సంక్షేమ శాఖపై సచివాలయంలో సవిÖక్ష నిర్వహించిన సీఎం, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీలకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. సంప్రదాయ కోర్సులు కాకుండా, జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణ ఇప్పించాలన్నారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తరహాలోనే మైనారిటీలకూ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆ కార్యక్రమానికి గ్రూప్స్‌నకు ఎంపికైన వారిని, క్రీడాకారులను ఆహ్వానించి విద్యా, క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలని సూచించారు. గ్రూప్`1, గ్రూప్`2, గ్రూప్`3కి ఎంపికైన మైనారిటీల్లో ఆసక్తి ఉన్న వారికి మైనారిటీ సంక్షేమ శాఖలో బాధ్యతలు అప్పగించి, ఆ శాఖ పరిధిలోని అన్ని కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగించేలా వారిని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఇమామ్, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ పారితోషికాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మైనారిటీ పాఠశాలల్లో బోధనలో ఏఐకి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. భూమి అందుబాటులో ఉన్న చోట ఖబరస్తాన్‌లకు కేటాయిస్తామని సీఎం తెలిపారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్టిక్ ఇంజిన్లతో రీట్రోఫిట్టింగ్ చేయడం ద్వారా ఆటోడ్రైవర్లకు ఇంధన ఖర్చులు లేకుండా చేసి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మÖసీ రివర్ ఫ్రంట్‌లో భాగంగా గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మతాల సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్‌ను తెలియజేసేలా ఆ కట్టడాలు ఉండాలని సీఎం అన్నారు. మన సంస్కృతులను అధ్యయనం చేసే గొప్ప కేంద్రాలుగా ఉండాలని ఆకాంక్షించారు. సవిÖక్షలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

దేశంలోని గొప్ప పరిశ్రమలన్నీ కొడంగల్‌కు తీసుకొస్తున్నాం
` నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తా
` 430 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన
` మహలక్క్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
` పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు
` కొడంగల్‌లో రాజకీయాలు పక్కనపెట్టి పని చేద్దామని పిలుపు
కొడంగల్(జనంసాక్షి): దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని ఉద్ఘాటించారు. అందరి సహకారంతో రాష్టాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. 430 పడకల ఆస్పత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వేంకటేశ్వర ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ మహలక్క్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం చేయటం అదృష్టమని చెప్ప్పుకొచ్చారు. తెలంగాణ పేదల తిరుపతిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఓవైపు గుడి.. మరోవైపు గడి ఏకమైన ఈ నియోజకవర్గాన్ని నందనవనంగా మార్చటానికి అందరు కలిసి రావటం అభినందనీయమని తెలిపారు. ఆగమశాస్త్ర పండితుడు సుందరవరదాచార్యులు కలలుగన్న గుడి నిర్మాణం సహకారం కావటం సంతోషమని చెప్పారు. తిరుపతిలో ఏ రకమైన పూజలు జరుగుతాయో ఇక్కడ అలాగే పూజలు జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ గుడికి కర్ణాటక, మహరాష్ట్ర నుంచి భక్తులు వస్తారని.. దీంతో కొడంగల్‌కు దేశంలో గుర్తింపు వస్తోందని తెలిపారు. కొడంగల్`నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని.. అనుమతులు వచ్చాయని, ఏడాదిన్నరలోపు పూర్తి చేద్దామని చెప్ప్పుకొచ్చారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీహరిని నిద్ర పోనీయొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్ప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైన తనకు సీఎం పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.కృష్ణ` వికారాబాద్ రైల్వేలైన్ త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. రేకులపాడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలను ఆరు నెలల్లో ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని అన్నారు. 20 ఎకరాల్లో లగచర్ల వద్ద విద్యాహబ్‌గా మార్చుతున్నామని సీఎం ఉద్ఘాటించారు. ఇక్కడ అనేక విద్యాసంస్దలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో ఉండాలని.. ఆ తర్వాత అందరం కలిసి పనిచేయాలని సూచించారు. 2034 వరకు గుంపులు, గ్రూపులు పక్కన పెట్టాలని.. అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. కొడంగల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.