సాగర్‌ గేట్లు నేడు ఎత్తనున్న అధికారులు

నల్లగొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): నాగార్జున సాగర్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ మధుసూదన్‌ తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్‌ ఇన్‌ప్లో 1,55,071 క్యూసెక్కులు కాగా, ఔట్‌ప్లో 44,097 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 583.90 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. సాగర్‌ ప్రస్తుత నీటినిల్వ 291.26 టీఎంసీలు, పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. ప్రాజెక్టు మొత్తం గేట్లు 26 కాగా ఇన్‌ఫ్లోను బట్టి గేట్లను ఎత్తనున్నారు.

 

తాజావార్తలు