సాగుచట్టాల తరహాలోనే ఉద్యమాలు రావాలి
ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాబాట పట్టాలి
కార్పోరేట్లకు ఆస్తులు కట్టబెట్టే చర్యలు మానాలి
న్యూఢల్లీి,నవంబర్19(జనం సాక్షి ) : నిజానికి 2019లో బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హావిూలు నెర వేర్చకుండా మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పోరేటీకరణ చేసేందుకు ప్రధాన కారణం ఇచ్చిన హావిూలనుంచి చేతులు దులుపుకుని రైతును కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలి పెట్టడమేనని ప్రధానంగా విమర్శలు వచ్చాయి. ఈ చట్టాల రద్దు నిర్ణయంతో మోడీ ఇకనైనా తన విధానాలను సవిూక్షిం చుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రజల ఆందోళనలు అర్థం చేసుకుని ముందుకు సాగాలి. అయితే మోడీ తన ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమైనది ఉత్పాదకతతను పెంచేందుకు వ్యవసాయ, గ్రావిూణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం వంటి హావిూలు ఇచ్చారు. దేశమంతటా గిడ్డంగుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి సమర్థ వంతమైన నిల్వ, రవాణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానని ప్రణాళికలో ప్రకటించారు. ఇప్పటికి ఈ రెండు హావిూలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అంతేకాదు గ్రామస్థాయిలో నిల్వ పథకాన్ని అమలు చేస్తామని, రైతులు తాము నిల్వ చేసుకున్న ఉత్పత్తులకు గాను రుణాలు ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఆచరణకు రాలేదు. నిజానికి ఇలాంటి చర్యలు అమలయి ఉంటే సాగుచట్టాలను మోదీ ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఇకపోతే చిన్న, మధ్యతరహా రైతులకు పింఛను పథకం కానీ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను దేశంలో అందరు లబ్దిదారులకు అమలు చేయడం కానీ జరగలేదు. రైతులకు వడ్డీ లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇవ్వడం, రైతులు భరించదగ్గ రేట్లలో వారి ఇంటికే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి గుమ్మం వద్దే టెస్టింగ్ సౌకర్యాలు కల్పించడం, సహకార సంఘాల ద్వారా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను నేరుగా మార్కెట్ చేయడం, నూనెగింజల విషయంలో స్వయంసమృద్ధి సాధించడం లాంటి హావిూలు అమలులోకి వచ్చిన దాఖలాలు కనపడడం లేదు. అత్యంత వేగంగా దేశంలో పెండిరగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మన నీటిపారుదల సామర్థ్యాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకుంటామని ఇచ్చిన హావిూలు కూడా కాగితాలు దాటిరాలేదు. అసలు ఇవన్నీ చేయడానికి మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కూడా తేలిపోయింది. రాష్టాల్రకు న్యాయసమ్మతంగా చెల్లించాల్సిన జీఎస్టీ బకాయీలకే దిక్కులేకుండా పోయింది. అలాంటి సందర్భంలో ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ఏ విధంగా ఆదుకుంటుందన్నదే ప్రశ్న. బహుశా తన నిస్సహాయతను కప్పిపుచ్చుకునేందుకే మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కార్పోరేట్ అస్త్రం ప్రయోగించి ఉంటారన్న అనుమానాలు కూడా వచ్చాయి. అందుకే సాగుచట్టాలపై ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు తీవ్ర విమర్శలకు దిగారు. సాగుచట్టాలు తేనె పూసిన కత్తులని, చిన్న, మధ్యతరహా రైతుల జీవితాలను దుర్భరంగా మారుస్తాయని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసిఆర్ స్పష్టంగా ప్రకటించారు. మొక్కజొన్నలపై దిగుమతి పన్నును 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించి మన రైతుల పొట్టకొట్టడంతోనే కేంద్రం స్వభావం అర్థమయిందని ఆయన ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌తో పాటు అకాలీదళ్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, శివసేన, ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీ తదితర ప్రాంతీయ పార్టీలు చేసిన విమర్శలకు తోడు వివిధ రైతు, వ్యవసాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, వీధుల్లోకి వచ్చి రవాణాను స్తంభింపచేయడం జరిగింది. దేశంలో చాలాకాలం తర్వాత మోదీ ప్రభుత్వానికి ఒక బలమైన వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇది రైతుల భవిష్యత్‌ను అంధకారంలో పడవేస్తుందని, కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి కల్పిస్తుందని వ్యవసాయరంగ నిపుణులు సైతం హెచ్చరించారు. నిజానికి ఈ బిల్లులపై పారదర్శకంగా, ప్రజాస్వామికంగా చర్చలు జరిపి, రైతులకు ఏ రకంగా మేలు చేయవచ్చో చర్చించి, అన్ని పక్షాలను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే రైతులకు మేలు జరిగేదు. పార్లమెంట్‌లో కూడా చర్చలకు ఆస్కారం కలిగించి ఉంటే ఇంత వేడి రాజుకునేది కాదు. సెలెక్ట్ కమిటీకి పంపించి పద్ధతి ప్రకారం వ్యవహరించినా ఇంత రచ్చ జరిగేది కాదు. ఎవర్నీ లెక్కచేయని ధోరణి ప్రదర్శించి బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదించే ప్రయత్నం చేయడం అనేక ప్రశ్నలు రేగేందుకు కారణమైంది. ఒకప్పుడు బోట్స్‌క్లబ్‌లో 5 లక్షలమంది రైతులతో నిరసన ప్రదర్శన జరిపి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని తన డిమాండ్లకు ఒప్పించిన మహేంద్ర సింగ్ తికాయత్ వంటి రైతునేతలు ఉద్భవించిన నేల అని రైతులు మరోమారు నిరూపించారు. సాగుచట్టాల రద్దు తరహాలోనే పెట్రో దరలపైనా ఉద్యమించాలి. జిఎస్టీలో బాదుడు వ్యవహారాలను సంస్కరించాలి. ఆర్థికరంగ పన్నులపైనా చర్చించాలి. ప్రబుత్వం అంటే పన్నులు వేయడం అన్న ధోరణి పోవాలి.