సాగునీటి రాకతో పెరిగిన భూగర్భజలాలు
వనపర్తి జిల్లాకేంద్రానికి భవిష్యత్ లో నీటి ఎద్దడి రాకుండా నగరం చుట్టూ చెరువులు పటిష్టం
దశాబ్దాలుగా చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేశారు
సాగునీరు సంగతి పక్కన పెడితే వానాకాలంలోనే తాగునీటికి తండ్లాడే పరిస్థితి
ఆ పరిస్థితి మళ్లీ రావద్దని వనపర్తి చుట్టూ ఉన్న నల్ల చెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం అమ్మచెరువు, శ్రీనివాసపురం లక్ష్మీ కుంటలను పటిష్టం చేశాం
నాడు వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు .. నేడు పునాదులు తవ్వితే భూగర్భజలాలు ఎగిసిపడుతున్నాయి
వనపర్తి జిల్లాలో రాష్ట్రంలోనే మిగతా జిల్లాల కన్నా పైకి భూగర్భజలాలు పెరిగాయి
4.40 మీటర్ల లోతున భూగర్భజలాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంపై దృష్టిసారించడం వల్లనే ఇది సాధ్యమయింది
సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు పక్కన పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను
తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేశాం
కాళేశ్వరం నిర్మాణంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయింది
వచ్చే ఏడాది పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తవుతాయి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం అయితే పాలమూరు కోనసీమను మించిపోతుంది
వనపర్తి జిల్లా కేంద్రంలో ఉదయం మార్నింగ్ వాక్ లో తాళ్లచెరువు, లక్ష్మీకుంట పనులను పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి