సాగునీరు ఇవ్వాల్సిందే

4

– మహబూబ్‌నగర్‌జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌ రివ్యూ

ఖరీఫ్‌ సీజన్లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందినీచాలని నీటిపారుదల  శాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు.సోమవారంనాడు జిల్లా పరిషత్‌ హాలులో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతిని, భూసేకరణ పనులను మంత్రి హరీష్‌ సవిూక్షించారు.సమర్ధంగా పనిచేసే అధికారులను అభినందిస్తామని, పెర్పార్మెన్స్‌ సరిగ్గా లేని వారు పనిష్మెంటు ఎదుర్కోక తప్పదని మంత్రి తీవ్ర నీగా హెచ్చరించారు. కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్‌ అధికారులు, స్థానిక శాసససభ్యులు సమన్వయూతో పనిచేసి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోపలే పూర్తి చేయాలని మంత్రి కోరారు. ఇదివరకు ఇచ్చిన హావిూ  మేరకు ఆయకట్టుకు నీరివ్వకపోతే ఇ.ఇ , డి.ఇ. ఇ లను బాధ్యత వహించాలని వారిపై చర్యలు తప్పవన్నారు. ఆయా కాంట్రాక్టు సంస్థలతో పని చేయించక తప్పదని ఇరిగేషన్‌ అధికారులను మందలించారు.జూలై కల్లా కల్వకుర్తి ప్రాజెక్ట్‌ నుంచి 1.50లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌ నుంచి 1.50లక్షల ఎకరాలు, బీమా ద్వారా 1.40లక్షల ఎకరాలు, కోయిల్‌ సాగర్‌ ద్వారా 20వేల ఎకరాలకు సాగునీరందించాలని మంత్రి సూచించారు. లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కృషి చేయాలన్నారు.ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సా ప్‌ గ్రూప్‌ ద్వారా తనకు సమాచారం అందించాలని హరీష్‌ కోరారు. కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు బిల్లుల విషయంలో జాప్యం లేకుండా మంత్రి చర్యలు తీసుకున్నారు. ఇటీవలె పెండింగ్‌ బిల్లులు మంజూరు అయినందున పనులు ఊపందుకుంటున్నయి.మహబూబ్‌నగర్‌ ప్రాజెక్ట్‌లు యుద్దప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు.పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై  నీటిపారుదల శాఖ మంత్రి సీరియస్‌గా దృష్టి పెట్టారు. నిరంతరం  సంబంధిత అధికారులతో ఫోన్‌ లో, వాట్సా ప్‌ గ్రూపుల ద్వారా సవిూక్షిస్తున్నారు.  నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పనులు జూలై కల్లా పూర్తి చేయాలని హరీష్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ  జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి  హరీష్రావు గుర్తుచేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా.. ఖరీఫ్‌ నాటికి లక్ష్యాన్ని సాధించాలని హరీష్‌ రావు కోరారు.  మంత్రి హరీష్‌ రావు ఆదేశాల మేరకు ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌, ఫీల్డు చానల్స్‌ లను తనిఖీలు చేస్తున్నామని ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు, ఇతర అడ్డంకులను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్టు మహబూబ్‌ నగర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఖగేందర్‌ రావు తెలియజేశారు. సీఎం కెసిఆర్‌, మంత్రి హరీష్‌ రావు ల ఆదేశాలకు అనుగుణంగా పనుల వేగం పెంచామని ఖరీఫ్‌ లో ఆయకట్టు టార్గేట్‌ పూర్తి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని సి.ఇ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్పి ఛైర్మన్‌ భాస్కర్‌, ఎంఎల్‌ఏలు, గువ్వల బాలరాజు, ఆళ్ల   వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసగౌడ్‌, చిట్టెం రామోహన రెడ్డి, రాజేంద్రనాథ్‌, అంజయ్య, ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్కె .జోషి, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామకృష్ణ, ఇ.ఎన్‌. సి మురళీధరరావు, ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, మహబూబ్‌ నగర్‌ సి.ఇ. ఖగేందర్‌ రావు, ఇరిగేషన్‌ ఓఎస్‌ డి శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే , ఇ.ఇలు, ఆర్డివోలు, ఇతర అధికారులు వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టు సంస్థల  ప్రతినిధులు పాల్గొన్నారు.

మరో 15 రోజుల్లో  కల్వకుర్తి ట్రయల్‌ రన్‌.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈనెల 25 న లిఫ్ట్‌-2 . లిఫ్ట్‌ – 3 లకు చెందిన మొదటి పంపు ట్రయల్‌ రన్‌ ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు సోమవారం నాడు ప్రకటించారు. రెండవ పంపు ఆగస్టులో, 3వ పంపు సెప్టెంబర్‌ చివరిలో, నాల్గవ పంపు డిసెంబర్‌ కల్లా ట్రయ్రల్‌ రన్‌ ప్రారంభిస్తామన్నారు. ఐదవ పంపు 2017 మార్చి కల్లా  ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి హరీష్‌ రావు చెప్పారు.