సాదాబైనామాలకు పచ్చజెండా

` స్టే ఎత్తివేసిన హైకోర్టు
` త్వరలోనే 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం
` మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):సాదా బైనామాలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.సాదా బైనామాలపై గతంలో విధించిన స్టే ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పటికే పెండిరగ్‌ లో ఉన్న తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు ఊరట లభించనుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 నవంబర్‌ 10 వరకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత సాదా బైనామాలపై స్టే విధించింది హైకోర్టు. సాదా బైనామాల అంశంపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు స్టే ఎత్తేస్తూ తీర్పు వెల్లడిరచింది. ఆర్‌ ఓ ఆర్‌ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపర్చక పోవడంతో.. సుమారు తొమ్మిదిన్నర లక్షలకు పైగా దరఖాస్తులు పెండిరగులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఇప్పుడు సాదాబైనామాలపై ఉన్న స్టే ఎత్తేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో గత కొన్నేళ్లుగా పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించనుంది. ఇదిలా ఉండగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సాదాబైనామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 4 లక్షల సాదాబైనామాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సమయంలో సాదాబైనామాలు క్లియర్‌ చేస్తామంటూ కాంగ్రెస్‌ హావిూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఉండటంతో ఈ అంశం పరిష్కారానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు కోర్టు తీర్పుతో సాదాబైనామాలను క్లియర్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని చెప్పాలి.