సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

మానకొండూరు,( జనం సాక్షి)

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సిజేరియన్ ఆపరేషన్లలో మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. శనివారం మానకొండూర్ లోని వేడుక మందిరంలో మహిళా శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 50 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహిస్తున్నామని చెప్పారు. పోషక లోపం గల గర్భిణీలను ,పిల్లలను గుర్తించి అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కరీంనగర్ లైన్స్ క్లబ్ (గోల్డెన్ జూబ్లీ) 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 50 మంది గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. భారతదేశంలో 55 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్ పర్సన్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ,జీవి రామకృష్ణ రావు, జెడ్పిటిసి శేఖర్ గౌడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు తదితరులు ప్రసంగించారు. ఎంపీపీ ముద్దసాని సులోచన, శిశు సంక్షేమ అధికారి సబిత, ఎంపీడీవో దివ్య దర్శన్ రావ్, తహశీల్దార్ ఎల్ .లక్ష్మారెడ్డి మానకొండూరు వైద్యాధికారిణి వినీత, అంగన్వాడీ టీచర్లు గర్భిణీలో తదితరులు హాజరయ్యారు.