సామాజిక మాధ్యమాల ద్వారా అక్రమాలు వెలుగు

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఖమ్మం జిలలా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఇసుక, అటవీసంపద, నల్లబెల్లం, పీడీఎస్‌ బియ్యం, గంజాయి తదితరాలపై నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రతి శాఖ కూడా సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, తద్వారా ఫలితాలు సకాలంలో వస్తాయన్నారు. అధికారులు కూడా తాము తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు సీజ్‌ చేసిన వసూలుచేసిన సొమ్ము గురించి వాట్సప్‌ గ్రూపులో సమాచారం ఇవ్వాలన్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత పట్టుకున్నారు., ఎంత ఫైన్‌ వసూలు చేసారు వాహనాల నంబర్లతో సహా ఇవ్వాలన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఒకరికొకరు చేరవేసుకోవాలని బార్డర్‌లో విదులు నిర్వహిస్తున్న పన్ను వసూలు శాఖల అధికారులను ఆదేశంచారు. మరోవైపు ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు ఖమ్మం నగర పాలక సంస్థ నడుం బిగించింది. చాలాకాలంగా కూడా వేచి చూసే ధోరణితో ఉన్నప్పటికీ ఎంతకీ వ్యాపారుల్లో మార్పు రాకపోయే సరికి కార్యక్షేత్రంలోకి దిగారు. ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువులు అమ్ముతున్న దుఖాణాలపై నేరుగా దాడులు

నిర్వహిస్తున్నారు. భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. దాడులు చేస్తే తమ వ్యాపారాలు సాగవని ఆదుకోవాలని నెత్తీ నోరు బాదుకుంటూ బ్రతిమాలారు. అయితే నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని అన్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగే అతి తక్కువ మైక్రాన్లు కలిగిన మట్లిలో కరిగిపోలేని కవర్లను ఖచ్చితంగా నిషేధం విదించడమే అవుతుందని చెప్పినట్లు సమాచారం.