సాయి భవానీ…..ప్లీజ్‌.. హెల్ప్ మీ!

bhavaniఈ పాప పేరు సాయి భవానీ. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు సత్యానారాయణ, లక్ష్మీల నాలుగో సంతానమైన.. సాయి భవానీ ప్రపంచంలోనే అరుదైన మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ తో పుట్టింది. అయితే పిల్లలను కనాలనే వీరి కలకు తల్లిపాలే శాపంగా మారాయి. అంతకముందు లక్ష్మీకి పుట్టిన ముగ్గురు పిల్లలు.. నెల రోజుల వ్యవధితోనే చనిపోయారు. లక్ష్మీకి మొదటి సంతానంగా పుట్టిన పాప 20 రోజులకు.. రెండో సంతానం కూడా 20 రోజులకే చనిపోయింది. మూడో సంతానంగా పుట్టిన బాబును బతికించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకపోయింది. మూడో సంతానంగా పుట్టిన బాబు పాలు తాగుతుంటే ఏడ్వడం గమనించిన సత్యనారాయణ, డాక్టర్లకు తల్లిపాలతోనే ఏదో సమస్య ఉందని చెప్పాడు. అప్పుడు లక్ష్మీకి ఓసోజోల్ పరీక్ష చేయగా గ్యాలక్టోజోమియా జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాలుగో సంతాన్నానైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని తల్లిపాలు తాగించకుండా ఉండాలని వైద్యులు సూచించారు.

నాలుగో సంతానంగా నీలోఫర్ హాస్పిటల్ లో పుట్టిన సాయి భవానీని పాలు తాగించకుండా 16 రోజుల పాటు వైద్యులు బతికించారు. ఆ తర్వాత సత్యనారాయణ వైద్యుల సూచనల ప్రకారం పాపకు.. వాటర్‌ లో తేనే కలిపి తాగించేవాడు. ఇలా ఆరు నెలల వరకు సాయి భవానీ కంటికి రెప్పలా కాపాడుకున్నారు.

తర్వాత నీలోఫర్ వైద్యుల సలహాతో ఢిల్లీ లోని ప్రముఖ వైద్య నిపుణుడు ఐసీ వర్మ వద్ద పరీక్షలు చేయించగా సాయి భవానీ మ్యాపుల్ సిరఫ్ యూరిన్ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారించారు. 40 లక్షల మందిలో ఒకరికీ ఈ మహమ్మారి వస్తుందని చెప్పడంతో సత్యానారాయణ దంపతులు అల్లాడిపోయారు. ఇక చేసేది లేక .. జబ్బుతో బాదపడుతున్న సాయి భవానీనీ ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నారు. 12 ఏండ్ల వరకూ తక్కువ ప్రోటీన్ల ఆహారం ఇవ్వాలని వైద్యులు సూచించడంతో పండ్ల రసాలు, గంజినీళ్లు ఇస్తూ భవానీని బతికించుకుంటున్నరు. అటు భార్యకు, ఇటు కూతురికి ట్రీట్‌ మెంట్‌ కోసం శక్తికి మించి అప్పులు చేసిన సత్యానారాయణ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అటు నాలుగో సంతానంగా పుట్టిన సాయి భవానీ దీర్ఘాయుస్సు కోసం దాతలు సాయమందించాలని కోరుతున్నారు.