సార్వత్రిక విద్యాపీఠం ప్రత్యేక అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవాలి.

 

 

 

 

జిల్లా కోఆర్డినేటర్ ఎం నాగరాజు.జిల్లా కోఆర్డినేటర్ ఎం నాగరాజు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్13(జనంసాక్షి):తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠంలో ఈ విద్యా సంవత్సరం 2022-23లో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు అపరాధ రుసుంతో ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజు తెలిపారు.మంగళవారం నాగర్ కర్నూల్ మండల విద్యావనరుల కేంద్రంలో వాల్ పోస్టర్స్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడవు పెంచారని జిల్లాలోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే కృషి చేయాలన్నారు.టీఎస్ ఆన్లైన్, మీసేవ ద్వారా ఓపెన్ స్కూల్ వెబ్సైట్లో ప్రవేశాలకు అపరాధ రుసుం చెల్లించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ల శెట్టి నాగర్ కర్నూల్ మండలం ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు.