సావిత్రిబాయిపూలే ఒకేషనల్ జూనియర్ కాలేజ్ లో ఘనంగా గోరింటాకు పండుగ

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో జులై 27జనం సాక్షి: అషాడ మాసం వర్షాకాలంలో మహిళలు నిత్యం నీళ్లలో చేతులు తడిపే పనులు చేస్తారు, కాబట్టి వారి యొక్క చేతులకి ఎలాంటి అనారోగ్యం సోకకుండా ఉండడానికి సాంప్రదాయంగా ఆరోగ్యకరమైన ఎన్నో చిట్కాలు ఉన్నాయి.. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి గోరింటాకు యొక్క విషిష్టతను ఈ కాలానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సావిత్రిబాయి పూలే ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపక బంధంతో ఘనంగా గోరింటాకు పండగ జరుపు కున్నారు , కళాశాల విద్యార్థులు గోరింటాకు చెట్టు నుంచి ఆకు తెంచి స్వయంగా తయారు చేసి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆహ్లాద వాతావరణం లో సంతోషకరమైన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మేకల రాజేందర్ మాట్లాడుతూ సనాతనంగా గోరింటాకు మహిళలకు ఆరోగ్యపరంగా ఏ విధంగా మేలు చేస్తుంది, అందం పరంగా ఏవిధంగా సహకరిస్తుంది అనే అంశంపై వివరించడం జరిగింది.మరియు అధ్యాపకురాలు ప్రవల్లిక మాట్లాడుతూ గోరింటాకు గౌరమ్మ ద్వారా వచ్చిన ఆకుగా చరిత్రను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నవీన్ కుమార్, జగన్, ప్రవల్లిక, దివ్య రహమత్ బేగం తదితరులు పాల్గొన్నారు.