సాహసగాథకు ప్రత్యక్ష ఉదాహరణ
ప్రపంచంలోనే ఇదో అరుదైన ఘటనగా, సాహసక్రీడగా నిలిచిపోతుంది. సాహసమంటే ఇది. ప్రతికూల పరిస్తితుల్లో 134 మంది ప్రాణాలను కాపాడిన రెస్క్యూ సిబ్బంది సాహసం గొప్పది. ప్రపంచం యావత్తూ ఊపిరిబిగబట్టి ఎదురు చూస్తున్న తరుణంలో గుహలో చిక్కుకున్న వారంతా క్షేమంగా బయటపడడం ఓ అడ్వంచర్ సినిమాను తలపించింది. నిజంగానే ఇదో సాహస సనిమాకు కథావస్తువు కానుంది. జగకూడని ఓ ఘటన జరిగితే ఎలా స్పందించాలో..వారిని ఎలా బయటకు తీసుకుని రావాలా అన్నది ఇక్కడ ముఖ్యం. ఈ ప్రక్రియ యావత్తూఏ సహసంతో కూడుకున్నది కావడంతో బాగానే శ్రమించాల్సి వచ్చింది. ఇదొక సవాల్ లాంటి సాహసంగా చరిత్రలో నిలిచిపోతుంది. దీనికితోడు ఓ పదిరోజులపాటు ఊపిరి బిగబట్టి పిల్లలతో పాటు కోచ్..నీళ్లున్న ఆ గుహలోనే ఉండిపోవడం నిజంగా ధైర్యానికి ప్రతీకగా నిలిచే సంఘటనగా చూడాలి. 13 మంది ఫుట్‌బాల్ జట్టు సభ్యులు ఆసక్తి కొద్దీ గుహలోకి వెళ్లారు. వారిలో ఒక్కరు మినహాయిస్తే అంతా 11 నుంచి 16 ఏండ్ల వయసున్న పిల్లలే కావడం వల్ల ప్రపంచం యావత్తూ వారుఎలాగైనా బయటపడాలని ప్రార్థనలు చేసింది. ప్రకృతి వైపరీత్య పర్యవసానంగా వారు గుహలో చేరి తిరిగి గమ్యం చేరుకోలేని ప్రమాదంలో పడిపోయారు. ఆపదలో చిక్కుకు పోయిన ఆ పదమూడు మందిని ఆదుకునేదెలా అన్నదే ప్రపంచం ఆలోచించి, అందరూ తమవతంఉ సహకరాం అందించడం ద్వారా ప్రపంచం అంతా ఒక్కటయ్యింది. చివరకు గుహలో చిక్కకున్న వారిని క్షేమంగా రప్పించి,గెలిచి సాధించిన ఘనవిజయమిది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని థాయ్ లువాంగ్ నాంగ్నాస్ గుహ లోపలంతా చిమ్మ చీకటి. గుహంటే మామూలు గుహ కాదు. ఎవరూ కనిపించని.. ఎంత పిలిచినా వినిపించని భీకర భయానక ప్రదేశాల సముదాయం. వెళుతున్న కొద్ది కళ్లు బైర్లు కమ్మేస్తూనే ఉంటాయి తప్పితే.. వెలుతురు మాత్రం ఎదురవ్వదు. పొరపాటున కూడా అంతలోపలికి ఎవరూ వెళ్లకూడని.. వెళ్లలేని గుహ అది. ఒకవేళ వెళితే ఇరుక్కుపోయినట్టే! అదే జరిగిందీ పుట్‌బాల్ నేర్ చుకునే పిలలకు. క్కాపల్ చాంట్వాంగ్ ఫుట్‌బాల్ జట్టు సహాయక కోచ్. 12 మంది భావి ఫుట్‌బాల్ ప్లేయర్లలో గట్స్ నింపాలనే ఉద్దేశంతో పిల్లలను లువాంగ్ గుహలోకి తీసుకెళ్లాడు.
జూన్ 23వ తేదీ ఫుట్‌బాల్ ప్రాక్టీస్ ముగించుకొని మళ్లీ గుహలోకి అడుగుపెట్టారు. వెంట తెచ్చుకున్న సైకిళ్లను వదిలేసి లోపలికి వెళ్లారు. వెళ్లనైతే వె ళ్లారు కానీ ఎటు వెళ్తున్నారో.. ముందుకెలా సాగాలో.. కాదనుకుంటే వెనక్కి ఎలా రావాలో కూడా తెలియనంత చీకటి కమ్మేసింది. ఇంతలో భారీ వర్షం. చూస్తుండగానే గుహల సముదాయంలోకి నీరు చేరింది. కొండలపై ఉన్న సొరంగాల ద్వారా భారీగా వర్షపు నీరు వచ్చి పడింది. లోపల్నుంచి బయటకు రావడానికి ఏమాత్రం అవకాశం లేకపోవడంతో వర్షపు నీరు ఎటైనా వెళ్తుండొచ్చు.. అది వెళ్లాక ప్రయాణం సాగిద్దాం అనుకున్నారు. కానీ వరద ఉధృతి పెరిగింది. అంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఇలా ఎనిమిది రోజులు గడిచాయి. ఎన్ని రోజులు అయ్యాయో వారికే తెలియదు. అంతా చీకటి. పగలేదో.. రాత్రేదో కూడా తెలియదు. లోపలికి వెళ్లినవాళ్లు ఎలా ఉన్నారో.. ఏం తింటున్నారో.. ఏమయ్యారో కూడా బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు గుహ ముందరే పడిగాపులు కాసి ప్రార్థనలు చేస్తున్నారు. రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఎంత వెతికినా ప్రయోజనం లేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా చిన్న ఆధారం దొరికినా చాలు దాన్ని పట్టుకొని పిల్లల జాడ కనుక్కోవచ్చు అని అనుకుంటుండగా.. ఒకచోట చెప్పులు కనిపించాయి. ఓ ఆధారం దొరికినట్టయింది. చుట్టూ చూశారు. అంతటా నీరు. చెప్పులు వదిలి వెళ్లారు అంటే అప్పటికే నీరు ఉన్నట్టుంది.. రెస్క్యూ టీమ్ సభ్యులు దీని ఆధారంగా ముందుకు వెళ్లగలిగారు. వారంతా గుహ లోపలికి వెళ్లారని నిర్ధారణకొచ్చారు.
లోపలికి వెళ్తే ఏవిూ కనిపించడం లేదు. ఎవరో మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. గుహలో ఇరుక్కున్న పిల్లల్లో అబ్దుల్ సమన్ అనే పిల్లాడికి ఇంగ్లిష్ వచ్చు. మమ్మల్ని కాపాడటానికి ఎవరైనా వచ్చారా? మేం ఈ గుహలో ఇరుక్కుపోయాం. ప్లీజ్ హెల్ప్ అంటూ తడబడుతున్న గొంతుతో గట్టిగా అరిచాడు. తని పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? అని పసిగట్టి అటువైపు సాగింది అన్వేషణ. ఇదొక రకంగా ప్రాణాలతో చెలగాటమే. కానీ పిల్లల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు రెస్క్యూ సిబ్బంది. ప్రాణాల విూద ఆశలు వదులుకొని వెళ్తున్నారు. ఇలా ఒక డైవర్ ప్రాణాలు కోల్పోయాడు కూడా. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా తట్టుకొని ఆపరేషన్ సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నీటితో నిండిన ప్రమాదకర మైన సన్నటి సొరంగ మార్గాల గుండా పయనిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసిన తీరు అద్భుతం. నిజజీవితంలో ఇంతటి ప్రమాదకరమైన ఘటనలు బహుశా అరుదనే చెప్పాలి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన థాయ్‌లాండ్ ‘గుహ నిర్బంధం’ కథ సుఖాంతమైంది. కబళించడానికి సిద్ధంగా ఉన్న వరదనీటి నడుమ 18 రోజుల పాటు చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్‌బాల్ జట్టు బాలలు, వారి కోచ్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో రిస్కుతో చేపట్టిన ఈ సంక్లిష్ట ఆపరేషన్ ముగిసింది. విదేశాల నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు, థాయ్ నౌకాదళానికి చెందిన సుశిక్షిత నౌకాదళ ‘సీల్స్’ బృందం మంగళవారం తుది ఆపరేషన్ నిర్వహించి, నలుగురు బాలలు, 25 ఏళ్ల కోచ్‌ను గుహ నుంచి వెలుపలికి తెచ్చాయి. సాహసోపేతమైన ఘన విజయంగా ప్రపంచంలోనే అరుదైన ఘటనగా చరిత్రలో నిలిపోయే ఘట్టంగా నిలవనుంది.