*సింగరాజుపల్లి ని మండలంగా ప్రకటించండి*
*దేవరుప్పుల,ఆగస్టు (జనం సాక్షి) :* మండలంలోని సింగరాజు పల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సింగరాజుపల్లి గ్రామ సాధన సమితి సభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం అందజేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ని వివరిస్తూ.. సింగరాజుపల్లి గ్రామం చుట్టుపక్కల 13 గ్రామాల ప్రజలకు ప్రస్తుతం ఉన్న మండల కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల వృద్ధులు మహిళలు రైతులు విద్యార్థులు పేద వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని
ఈ సందర్భంలో 24 వేల మంది ప్రజల పక్షాన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు మండల ఆవశ్యకత గురించి వివిధ గ్రామాల ప్రజలు పార్టీలకతీతంగా గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటిసి సింగరాజుపల్లి మండల కేంద్రంగా ప్రకటించాలని వివిధ రూపాలలో వినతిపత్రాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమేనని
సింగరాజు పల్లి గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని ఈ రోజు హైదరాబాదులోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు కి కలిసి సింగరాజు పల్లి మండలం యొక్క ఆవశ్యకత అవసరము తద్వారా ప్రజలకు వివిధ వర్గాల వారికి అనుకూలంగా ఉండే విషయాన్ని సవివరంగా వివరించారు. ఈ సందర్భంలో మంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి ఈ గ్రామాలలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కలిసి వస్తే ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్ళి సాధ్యమైనంత త్వరగా గ్రామాన్ని మండల కేంద్రంగా అధికారికంగా ప్రకటించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని సానుకూలంగా స్పందించిన మంత్రివర్యుల కి కృతజ్ఞతలు తెలియజేసిన సింగరాజు పల్లి గ్రామ మండల సాధన సమితి సభ్యులు వివిధ గ్రామాల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసారు.