సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిబిరం

26నుంచి శిబిరంలో ఉచిత క్రీడా శిక్షణ
కొత్గూడెం,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి):  సింగరేణి ఉద్యోగుల పిల్లలకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.ఈ శిబిరంలో 19సంవత్సరాలలోపు పిల్లలకు ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌, కరాటే ఉచితంగా నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26నుంచి మే 20వ తేదీ వరకు 25రోజుల పాటు శిబిరం నిర్వహించడం జరుగుతుందని, సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో సింగరేణి వర్క్‌పీపుల్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి ఉచిత క్రీడల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి రేవు సీతారాం తెలిపారు. సింగరేణి సంస్థ యాజమాన్యం నిర్వహిస్తుందని, సింగరేణి ఉద్యోగుల పిల్లలకు క్రీడల్లో మంచి నైపుణ్యం పెంపొందించేందుకే వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇదిలావుంటే సింగరేణి కొత్తగూడెం ఏరియాలో వివిధ డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పనివేళలు మార్చాలంటూ కొత్తగూడెం ఏరియా డీవైజీఎం డి.సూర్యనారాయణకు వినతి పత్రం అందచేశారు. . కొత్తగూడెం ఏరియాలోని వివిధ డిపార్ట్‌మెంట్‌లలో వందల మంది కాట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వీరిలో చాలామంది ఆరుబయట విధులు
నిర్వహిస్తున్నారని వేసవి ఎండతీవ్రత వల్ల అనేక ఇబ్బందులకుగురవుతూ పనిచేయలేకపోతున్నారని అన్నారు.  రోజురోజుకీ పెరుగుతున్న ఎండల దృష్ట్యా వీరిలో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారని కావునా వేసవికాలం పూర్తయ్యే వరకు కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం ఉన్న పనివేళలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు పనివేళలు మార్చాలని వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన డీవైజీఎం సూర్యనారాయణ ఏరియా జనరల్‌మేనేజర్‌ కేవీ రమణమూర్తికి వివరించగా సోమవారం నుండి పనివేళలు మారుస్తామని హావిూ ఇచ్చారు.