సింగరేణి ఒప్పంద కార్మికుల డిమాండ్లపై చర్చలు సఫలం
సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు గూగులోత్ రామచందర్
టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి): 18 రోజులుగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులు నిరవధికంగా తమ న్యాయమైన డిమాండ్లపై చేస్తున్న సమ్మెపై చర్చలు సఫలమయ్యాయని సిపిఐ ఏఐటియుసి జిల్లా నాయకులు రామచందర్, అయిత శ్రీరాములు తెలిపారు. టేకులపల్లి సింగరేణి కాలనీ లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు గూగులోతు రామచందర్, అయితే శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ ది 26, 9, 2022 నా హైదరాబాదులోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం రోజున యాజమాన్యం ప్రతినిధులతో చర్చలు జరిగాయి. వేతన పెంపును వేగంగా అమలు చేస్తామని సింగరేణి ప్రతినిధులు అంగీకరించారని, కనీస వేతనాలు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తర్వు 22ను సత్వరం అమలు చేయాలని కోరుతూ ముఖ్య కార్యదర్శికి సిఎండి లేఖ రాసినట్లు తెలిపారు. మొత్తం 16 డిమాండ్లు గాను 12 డిమాండ్లపై సానుకూలత తెలపడంతో 18 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు పరిష్కారం లభించింది అన్నారు. అనంతరం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు సమక్షంలో సింగరేణి యాజమాన్యం జిఎంలు ఆనందరావు, రమేష్ బాబు, ఏజీఎం కవితా నాయుడు ద్వారా చర్చల్లో భాగంగా ఒప్పందం జరిగినందున యధావిధిగా కార్మికులు విధుల్లో పాల్గొన్నారని తెలిపారు.