సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 11.వ వేజ్ బోర్డు లో ఫస్ట్ కేటగిరి వేతనం అమలు చేయాలి. * సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ SCCWU-IFTU

టేకులపల్లి, జూన్ 27( జనం సాక్షి ): సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు 11వ వేజ్ బోర్డులో ఫస్ట్ కేటగిరి వేతనాలు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధోని నాగేశ్వరరావు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మోత్కూరి మల్లికార్జునరావు లు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర నాయకులు  కోటిలింగం అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్మికులు అతి తక్కువ వేతనాల తో రోడ్డు అండ్ బిల్డింగ్ కార్మికులకు ఇచ్చే జీ.ఓ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఎస్.సి.సి.డబ్ల్యు.యు- ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం లో వివిధ సింగరేణి డిపార్ట్మెంట్లలో ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. 8,9,10 వ వేతన ఒప్పంద కాలం నుంచి అన్ని వేతన ఒప్పందాల సందర్భంగా సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కు అందరికీ ఫస్ట్ క్యాటగిరి వేతనం అమలు చేయాలని, మైనింగ్ యాక్ట్ ప్రకారం  కాంట్రాక్టు కార్మికులకు చట్టాలు అమలు చేయాలని, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎస్ సి సి డబ్ల్యూ  యు – ఐ ఎఫ్ టి. యు ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తున్నాం అని అన్నారు.  సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలు ఐ యన్ టీ యు సి, ఏ.ఐ.టీ.యూ.సీ,  బి.ఎం.ఎస్, హెచ్.ఎం.ఎస్,.  సి.ఐ.టి.యు. నాయకులు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పైన జె బి సి సి ఐ లో  చర్చించకుండా  వేతన ఒప్పందాలు చేయకుండా కాంట్రాక్ట్ కార్మికుల వద్దకు వచ్చి పోరాట చేస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 9.వ వేతన ఒప్పంద కాలంలో ఐ ఎఫ్ టి యు పోరాట ఫలితంగా ఏర్పడ్డ హైపవర్ కమిటీ వేతనాలు కానీ,  10.వ వేజ్ బోర్డు సందర్భంగా రిలీజ్ అయిన మినిమం వెజ్ జీ.వో.లను సింగరేణి యాజమాన్యం తో గుర్తింపు కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం తో అమలు చేయించడంలో వైఫల్యం చెందాయి అని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ లో ఢిల్లీలో జరిగిన 11. వ వెజ్ బోర్డు రెండవ దఫా చర్చల సందర్భంగా బొగ్గు గనుల శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి బొగ్గు గనుల శాఖ మంత్రికి మెమోరాండం సమర్పించారు. అదేవిధంగా 11వ వేజ్ బోర్డు చర్చల్లో పాల్గొన్న కోల్ ఇండియా చైర్మన్, సింగరేణి డైరెక్టర్ ఫా లతోపాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులకు సమావేశాలు జరుగుతున్న అశోక హోటల్ ముందు ధర్నా చేసి  సింగరేణి  కాంట్రాక్టు కార్మికులకు. .  ఎలాంటి స్పందన యాజమాన్యం నుంచి గాని, జాతీయ కార్మిక సంఘాల నుండీ కానీ లేకపోవడాన్ని SCCWU -IFTU తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని అన్నారు.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాల నాయకులు 11వ వేజ్ బోర్డు  నాలుగవ దఫా చర్చలు హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఫస్ట్ క్యాటగిరి వేతనం అమలు చేయాలనే డిమాండ్ తో  మరోసారి హైదరాబాద్ లో భారీ ఎత్తున సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్ సి సి డబ్ల్యు యు – ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో ధర్నా చేయబొతు పోతున్నాం. ఈ ధర్నాకు సింగరేణి లో ఉన్న కాంట్రాక్టు కార్మికులు అత్యధిక సంఖ్యలో  పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాయండ్ల కోటిలింగం, వెంకటేష్, శివయ్య, యాకు ఉపేందర్ ,చిట్టిబాబు ,భద్రయ్య ,విజయ ,రమ, సావిత్రి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.