సింగరేణి కార్మికులకు దసరా కానుక
సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. దసరా కానుకగా.. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటా చెల్లిస్తమని అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సింగరేణిలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. నాలుగేళ్లుగా సింగరేణి లాభాల బాటలోనే పయనిస్తుందన్నరు. సింగరేణిలో జరుగుతున్న ప్రగతి ప్రభుత్వ పాలన దక్షతకు నిదర్శమన్నరు. ఉమ్మడిరాష్ట్రంలో సింగరేణి కార్మికులను పట్టించుకోలేదన్నరు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు.