సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి విద్యాకోర్స్‌లకు మంచి స్పందన

 

భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా సింగరేణి సేవా సమితి కార్పోరేట్‌ ఏరియా ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్యా కోర్స్‌లలో పరిసర ప్రాంత మహిళల శిక్షణ పొంది ఆర్ధికంగా ఎదగాలని ఉచిత వృత్తి విద్యాకోర్స్‌లను నిర్వహిస్తుంది. శనివారం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసింది. ఇందులో భాగంగా మెయిన్‌ ఆసుపత్రి ఏరియా గాంధీనగర్‌ కాలనీ మహిళల కోసం 6 నెలల పాటు జరిగే ఉచిత టైలరింగ్‌ శిక్షణా తరగతులను మహిళలు అధిక సంఖ్యలో హాజరై అనూహ్యస్పందన కనబరిచి నేర్చుకుంటున్నారని సేవా కోఆర్డినేటింగ్‌ మరియు సీనియర్‌ పర్సనల్‌ ఆఫీ సర్‌ బేతిరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ కాలనీ మహిళలు మాట్లాడుతూ ఇటువంటి వృత్తి విద్యా కోర్స్‌లు మామారుమూల పరిసర ప్రాంత మహిళల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్‌ శిక్షణా తరగతులను మాకు ఎంతో ఉపయోగడుతుందని మాకు ఇస్తున్న ఈ ప్రోత్సాహానికి సింగరేణి జిఎం పర్సనల్‌ వెల్పేర్‌ అండ్‌ సిఎస్‌ఆర్‌ ఎం. మసూద్‌ ముజాహిద్‌కు, సింగరేణి యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా కార్యదర్శి సుమభాను, గాంధీనగర్‌ సేవా సభ్యులు శాంతి, విజయలక్ష్మి, సేవా కోఆర్డినేటర్‌ ఎజాజ్‌ఫరీష్‌, సాగర్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

నోట్‌ ఫొటో రైటప్‌:26కెజిపి-1 ఫొటో.

======================================================