*సిఎం కేసీఆర్ కు దళిత కుటుంబాలు జీవితాంతం ఋణపడి ఉంటాయ్*

 

*నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*
రామన్నపేట సెప్టెంబర్11 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళిత కుటుంబాలు జీవితాంతం ఋణపడి ఉంటాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  అన్నారు. ఆదివారం రామన్నపేట మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో దళితబంధు పథకం ద్వారా 38 మంది లబ్ధిదారులకు మంజూరైన వివిధ యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. గ్రామంలో 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాల్లోలేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు,కుల మతాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు, సమాజంలో అనేక దశాబ్దాలుగా దళితులు వివక్ష ఎదుర్కొంటున్నారు, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు, దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజ్ లేకుండా 100% సబ్సిడీ తో రూ.10 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి అందించాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు, దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పై , దళిత బంధు పథకంపై కొందరు సృష్టిస్తున్న అపోహలను లబ్ధిదారులు తిప్పికొట్టాలనీ ఆయన పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, జడ్పిటిసి పున్న లక్ష్మీ జగన్మోహన్, సింగల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షంరెడ్డి ,మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి, కార్యదర్శి పోషబోయిన మల్లేశం సర్పంచులు బొక్క యాదిరెడ్డి ,ఎడ్ల మహేందర్ రెడ్డి, అప్పం లక్ష్మీనర్సు ,రేఖ యాదయ్య, కడమంచి సంధ్య, చెరుకు సోమయ్య ,మెట్టు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీలు ఏనుగు జయమ్మ వెంకటరెడ్డి, దోమల సతీష్, గాదె పారిజాత కో ఆప్షన్ మెంబర్ ఎండి అమీర్ నాయకులు అంతటి రమేష్, బద్దుల రమేష్ , బొక్క మాధవరెడ్డి ,బత్తుల వెంకన్న, పున్న వెంకటేశం , కూనూరు ముత్తయ్య, బొక్క పురుషోత్తం రెడ్డి, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, పోతరాజు సాయి దాసిరెడ్డి శ్రవణ్ రెడ్డి సల్ల సత్య ప్రకాష్, బండ శ్రీనివాస్ రెడ్డి, ఆవుల శ్రీధర్, బొలుగుల కృష్ణ, చిట్టిమల్ల సుధాకర్ రెడ్డి, బొక్క జయచంద్ర రెడ్డి, బొక్క ముత్యంరెడ్డి ,కళ్లెం స్వామి, కల్లూరి నరేష్, పరుశరాములు బత్తిని మహేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.