సిపిఐ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 11. (జనంసాక్షి). ప్రధాని మోడీ పర్యటన నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద శుక్రవారం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, సీనియర్ నాయకులు సామల మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో కడారి రాములు, మంచికర్ల రమేష్ పలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.