సిపిఐ ఇల్లందు పట్టణ నూతన కమిటీ ఎన్నిక….

ప్రజా సమస్యలే అజెండాగా ఉద్యమిస్తాం బందం నాగయ్య….
ఇల్లందు జూన్ 27 (జనం సాక్షి)  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇల్లందు పట్టణ కార్యదర్శిగా పట్టణ కేంద్రానికి చెందిన బందం నాగయ్య  ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పట్టణ మహాసభలో మహాసభ ప్రతినిధులు ఎన్నుకున్న నూతన కౌన్సిల్ సభ్యుల సమావేశం సోమవారం పట్టణ కేంద్రంలోని విఠల్ రావు  భవన్ లొ జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ కార్యదర్శిగా బందం నాగయ్య, సహాయ కార్యదర్శులుగా కుమ్మరి రవీందర్, ఎస్కే షంషుద్దిన్,  కోశాధికారిగా బొల్లి కొమరయ్యలు   కార్యవర్గ సభ్యులుగా కె సారయ్య, దేవరకొండ శంకర్, ఎండి నజీర్ అహ్మద్, దాసరి రాజారామ్, కమటం చంద్ర, కనకతార, భైరవేని సదానందం, సూరిబాబు, లు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 47మందితో నూతన కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ సందర్బంగా  బందం నాగయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలే ఎజండాగా చేసుకొని ఉద్యమాల ఉదృతిని పెంచుతామాని, ప్రధానంగా పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలుకోసం ఉద్యమాలు చేపడతామన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టుతాము అని  సింగరేణి ప్రాజెక్టు ప్రభావిత ఏరియా లొ మౌలిక సదుపాయాలు, కాంట్రాక్టు పనుల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని,నూతనంగా ఏర్పాటు చేయబడె ఓసి ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన వారికి పరిహారంకోసం సింగరేణి యాజమాన్యంపై వత్తిడి తెస్తామని తెలిపారు.