సిపిఐ టేకులపల్లి మండల నూతన ఆఫీస్ బేరర్స్ ✍️ సిపిఐ టేకులపల్లి మండల కార్యదర్శిగా గుగులోత్ రాంచందర్ ✍️ 11 మంది కార్యవర్గం, 24 మందితో మండల కౌన్సిల్ ఏర్పాటు 🔹 ప్రజా సమస్యలే అజెండాగా ఉద్యమిస్తాం : రాంచందర్
టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) టేకులపల్లి మండల కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన గుగులోత్ రాంచందర్ తిరిగి ఎన్నికయ్యారు. 11 మంది కార్యవర్గం 24 మందితో మండల కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్లు ఇటీవల జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇటీవల జరిగిన మండల మహాసభలో మహాసభ ప్రతినిధులు ఎన్నుకున్న నూతన కౌన్సిల్ సభ్యుల సమావేశం బుధవారం మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గుగులోత్ రాంచందర్, సహాయ కార్యదర్శులుగా ఎజ్జు భాస్కర్, గుగులోత్ శ్రీను, వాసం భద్రయ్య, కోశాధికారిగా బానోత్ వీరన్న, కార్యవర్గ సభ్యులుగా ఐతా శ్రీరాములు, తేజావత్ లక్ష్మణ్, బండి వీరభద్రం, గుగులోత్ సోని, ఎజ్జు విజయలక్ష్మి, కర్లపూడి సుందర్ పాల్ లు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 24 మందితో నూతన కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ సందర్బంగా గుగులోత్ రాంచందర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలే ఎజండాగా చేసుకొని ఉద్యమాల ఉదృతిని పెంచుతామాని, ప్రధానంగా మండలంలో పోడు సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలుకోసం ఉద్యమాలు చేపడతామన్నారు. సింగరేణి ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, కాంట్రాక్టు పనుల్లో స్థానిక యూవతకు ఉద్యోగాలు కల్పించాలని, ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన వారికి పరిహారంకోసం సింగరేణి యాజమాన్యంపై వత్తిడి తెస్తామని తెలిపారు. వ్యవసాయ కూలీ, రైతుల కోసం సింగరేణి కార్మికుల, కార్మికుల కోసం హమాలీ వర్కర్ల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం సిపిఐ పార్టీ ఎప్పుడూ ఎర్ర జెండా పట్టుకొని ఎన్నో పోరాటాలు చేసి వారందరికీ అండగా నిలిచిందని అన్నారు. ఎర్రజెండా సిద్ధాంతమే పేదల కోసం పోరాటమని, ఎర్రజెండా పోరాటాలు చేస్తుందంటే అధికార పార్టీలో ఉన్న ఎవరైనా దిగి రావాల్సిందే నని రాంచందర్ నాయక్ అన్నారు. ఎర్రజెండా ఎప్పుడూ కూడా అధికారం కోసం ప్రాకులాట లేదని పేదల పక్షాన పోరాటాలు చేయడమే తమ సిద్ధాంతమని ఆయన అన్నారు.