సిపిఐ మండల మహాసభను జయప్రదం చేయండి.
కోటగిరి జూలై 20 జనం సాక్షి:-ఈ నెల 22న కోటగిరి మండల కేంద్రంలో జరిగే సిపిఐ మండల మహాసభకు కార్యకర్తలందరు తరలిరావాలని బుధవారం రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో సి.పి.ఐ మండల కార్యదర్శి ఏ. విఠల్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని పారిశ్రామిక సహకార సంఘంలో ఈ నెల 22న జరిగే సిపిఐ మండల మహాసభకు మండల సి.పి.ఐ నాయకులు,కార్యకర్తలు,భవన నిర్మాణ కార్మికులు,కూలీలు,గీతా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.