సిమెంట్ లోడింగ్ కార్మికులకు నెలకు 26 డ్యూటీలు ఇవ్వాలి—కొలిశెట్టి
చింతలపాలెం — జనంసాక్షి
సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం,దొండపాడు గ్రామంలో సిఐటియు ఆధ్వర్యాన జువారి సిమెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు,దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సిమెంట్ పరిశ్రమల కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నదని వారన్నారు,కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాల కాలంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పెట్టుబడి దార్లకు కార్పొరేట్ పరిశ్రమలకు అనుగుణంగా చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోర్టులను తీసుకురావడం జరిగిందని విమర్శించినారు. స్థానిక జువారి సిమెంట్ కార్మికులు డ్యూటీలు రాక మేనేజ్మెంట్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని వారన్నారు.స్థానిక సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత, పెరుగుతున్నదారులకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. జువారి సిమెంట్ కార్మికులకు నెలకు 26 డ్యూటీలు ఇవ్వాలని వారన్నారు.ఉమ్మడి మండలంలో సిమెంట్ పరిశ్రమలు కార్మికులు జీతాలు పెంచక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వారి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి వారి సమస్యలను వెంటనే మేనేజ్ మెంట్ పరిశీలించాలని వారన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు,యూనియన్ అధ్యక్షులు,కార్యదర్శులు,రాజశే ఖర్,సూరి బాబు,కమల్,వెంకయ్య,కారంపూడి శీను,ఆర్ శీను,వీరయ్య,నన్నేసాబ్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.