సిరాల బోల్సా గ్రామాలనుసందర్శించిన.జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి.

భైంసా జనం సాక్షి జూలై27

నిర్మల్ జిల్లా ,,భైంసా మండలంలో గత గురువారం కురిసిన భారీ వర్షానికి సిరాల ఆనకట్ట తెగిపోయి ప్రజలకు భారీ పంటనష్టం వాటిల్లింది. దీంతో జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం సిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిరాల, బోల్సా గ్రామాల ముంపు బాదితులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు.అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ బాధిత గ్రామాల ప్రజలకు యుద్ధప్రాతిపతికంగా తాక్కలిక పునరావాసాన్నీ కల్పించామన్నారు.రోడ్ల నిర్మాణానికి ఈ రోజు అంచనాలు సిద్దంచేసి రేపటి నుంచి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరాను పునుద్ధరింస్తం అన్నారు.సిరాల రిజర్వాయర్ ఆనకట్ట తెగిపోవటం జరిగిన పంటల నష్టం పై నివేదికలు సిద్దం చేసి పరిహారం అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. వెంట ముధోల్ ఏమ్మెల్ల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ ఇన్చార్జి అనందరావు పటేల్ అదికారులు ఉన్నారు.

తాజావార్తలు