సిరిసిల్ల కలెక్టర్ ను “వదలని” సైబర్ నేరగాళ్లు..
మళ్లీ అనురాగ్ జయంతి ప్రొఫైల్ తో నకిలీ వాట్సప్ ఖాతా.
డబ్బులు అడిగితే నమ్మొద్దని కోరిన కలెక్టర్.
సిరిసిల్ల. అక్టోబర్ 18. (జనం సాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. తాజాగా మరోసారి కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రొఫైల్ ఫోటోతో కూడిన వాట్సాప్ నెంబర్ 8881020414 ద్వారా నకిలీ వాట్సప్ ఖాతాను సృష్టించి అధికారులను డబ్బులు అడుగుతున్నట్లు తన దృష్టికి రావడంతో కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులు ప్రజలు ఎవరు స్పందించవద్దని మంగళవారం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి వసూళ్లకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న మళ్లీమళ్లీ పునరావృతం కావడం గమనార్హం.