సిరిసిల్ల భౌగోళిక ప్రాంతంపై మంత్రి కేటీఆర్ కు సోయి లేదు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే. మహేందర్ రెడ్డి.
నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). సిరిసిల్ల నియోజకవర్గ భౌగోళిక ప్రాంతంపై మంత్రి కేటీఆర్ కు కనీస అవగాహన లేకుండా పోయిందని రైతుల పట్ల సోయి కూడా లేదని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే.మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు సిరిసిల్ల నియోజకవర్గం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. చెరువులు మత్తడి దుంకడంతో పాటుపాటు చెరువులకు గండ్లు పడడంతో పొలాల్లో ఇసుక మెటలు వేసి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై మంత్రి కేటీఆర్ కు కనీసం సోయి కూడా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో గత వేసంగిలో రైతులు అతివృష్టితో తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు పదివేలు ఇస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వలేదని అన్నారు. సిరిసిల్ల భౌగోళిక పరిస్థితులపై మంత్రి కేటీఆర్ కు కనీస అవగాహన కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండి ధైర్యం చెప్పాల్సిన మంత్రి కనీసం నియోజకవర్గం లో అడుగుపెట్టకపోవడం పై విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పరిహారం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నాగుల సత్యనారాయణ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాష్, అన్నదాస్ భాను తదితరులు పాల్గొన్నారు.