సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఎగుమతులు చేసే దిశగా తీర్చిదిద్దుతాము.
చేనేత జౌలి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
రాజన్నసిరిసిల్లబ్యూరో సెప్టెంబర్ 22. (జనం సాక్షి). సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చేసే దిశగా తీర్చిదిద్దుతామని చేనేత జౌలి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల మోహాముల్లో చిరునవ్వులు చూసేందుకు , సిరిసిల్ల లో నేత కార్మికులకు పని కల్పించేందుకు ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారె గా బతుకమ్మ చీరలు అందిస్తుందని అన్నారు.
ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు.
చేనేత కార్మికులు 40 శాతం, మర కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ఇస్తున్నామని
టెక్స్ టైల్ పార్క్ లో జుకి మేష
జనసమ్మర్దక శిక్షణ కేంద్రం పెట్టడంతో పాటు అపెరల్ పార్క్ లో 8-10 వేల మంది మహిళలకు త్వరలోనే ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు.
పె ద్దూ ర్ లో 80 ఎకరాల్లో వీవింగ్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నాన్నట్లు తెలిపారు.
పక్క రాష్ట్రం తమిళనాడు తిర్పూర్ లో ప్రతి సంవత్సరం ప్రపంచ విపణి లో 40 వేల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తున్నారని . అదే తరహాలో
సిరిసిల్లను తీర్చిదిద్దుతామని అన్నారు.న్యూజిలాండ్ లో రాజన్న సిరి పట్టు పేరుతో సిరిసిల్ల చీరలకు బ్రాండింగ్ చేస్తున్నారని హర్ష వ్యక్తం చేశారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా కోటి చీరలు సిద్ధం చేశాం
తెలంగాణ మొత్తం కు బతుకమ్మ పండుగ కానుక అందించే చీరలు సిరిసిల్ల నుంచే ఉత్పత్తి కావడం మనందరికీ గర్వ కారణం అన్నారు సిరిసిల్లలో అపెరల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 8 నుంచి10 వేల మంది మహిళలకు త్వరలోనే ఉపాధి కల్పిస్తామన్నారు. పెద్దూర్‌లో 80 ఎకరాల్లో వీవింగ్ పార్క్‌ను ఏర్పాటుచేయనున్నామన్నారు.
తమిళనాడు తిరుప్పూర్‌లో వెళ్లి అక్కడి వస్త్ర పరిశ్రమను పరిశీలించి రావాలని పవర్‌లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్‌కు సూచించారు నేతన్నల అభివృద్ధికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతామన్నారు. న్యూజిలాండ్‌లో రాజన్న సిరిపట్టు పేరుతో సిరిసిల్ల చీరలకు బ్రాండింగ్ చేస్తున్నామన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,
చేనేత జౌలిశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి,
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్యే చెన్నమనేనీ రమేష్ బాబు, తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్ , టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
తదితరులు పాల్గొన్నారు.