సిరోల్ మండలంలో సంక్షేమ హస్టల్లను ఏర్పాటు చేయాలి -ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు

సిరోల్ అక్టోబర్-22

(జనం సాక్షి న్యూస్)

నూతనంగా ఏర్పడిన సిరోల్ మండలంలో సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు పట్ల మధు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ సీరోల్ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి,అనంతరం ఎమ్మార్వో విజయ్ కుమార్ కి వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ…. మండలంలో హాస్టల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు.. దాంతోపాటు ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడం వల్ల మూసివేసే పరిస్థితికి వచ్చాయన్నారు. దాంతోపాటు ఇది గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ హాస్టల్ను ఏర్పాటు చేస్తే విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలో చేరే అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి సంక్షేమ హాస్టల్లో ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకుడు వీరేందర్ మహేష్ నవీన్ నరేష్ ప్రమోద్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Attachments area