సిలబస్‌లో స్వల్ప మార్పులే
-రాగల రెండేళ్లలో పూర్తి మార్పులు
-ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్,జనవరి29: సిలబస్‌లో స్వల్ప మార్పులే ఉంటాయని సిలబస్ అడ్‌హక్ కమిటీ చైర్మన్ ప్రోఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.భేటి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మూలాలు, తెలంగాణ అంశాలే భవిష్యత్తులో పాఠ్యాంశాలుగా ఉంటాయన్నారు. తమకు అప్పజెప్పిన పనిని సకాలంలో పూర్తి చేశామన్నారు.
కంటెంట్ ఏముండాలి కరిక్యులంపై తరువాత చర్చిస్తామన్నారు. అంతకుముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు సంబంధించి పాఠ్యాంశాల మార్పుపై ఏర్పాటు చేసిన అకడమిక్ కమిటీ గురువారం ఇక్కడ సమావేశమైంది. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో 30 మంది సభ్యులు ఉన్నారు. పాఠ్యాంశాల మార్పుపై కమిటీ తుది నిర్ణయం తీసుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నివేదిక సమర్పించనుంది.పాఠ్యాంశాల మార్పుపై అకడమిక్ కమిటీ తుది కసరత్తు చేస్తోంది. టీఎస్‌పీఎస్‌సీ కి హరగోపాల్ కమిటీ ఈ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సారి నిర్వహించే పరీక్షలకు సిలబస్‌లో స్వల్పమార్పులు ఉంటాయని రాగల రెండేళ్లల్లో పూర్తి మార్పులు చేపడతామని కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగణ చరిత్ర, తెలంగాణ బౌగోళికాంశాలను పూర్తిగా సిలబస్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు