సిలబస్‌ తెలంగాణ ప్రతిబింబం

5

స్వల్ప మార్పులతో నివేదిక అందజేసిన హరగోపాల్‌ కమిటీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జనంసాక్షి): ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పనకోసం నివేదిక తయారుచేసేందుకు నియమించిన సిలబస్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ నేతృత్వంలోని సభ్యుల బృందం చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణికి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకుని సిలబస్‌, పరీక్ష విధానంలో స్వల్ప మార్పులే చేశామని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన విధంగా నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్‌లను జారీ చేయాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సిలబస్‌ కమిటీ, పరీక్షలకు సంబంధించి ఎటువంటి వదంతులను నమ్మొద్దని సూచించారు.  టీఎస్‌పీఎస్‌సీ సిలబస్‌ కమిటీ భేటీ ముగిసింది. మూడు వారాల పాటు పాత సిలబస్‌ను పరిశీలించామని, చారిత్రక మార్పుల మేరకు సిలబస్‌, పరీక్షల్లో స్వల్ప మార్పులు చేశామని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇవ్వాలని, రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి సూచించామని కోదండరాం తెలిపారు. గ్రూప్స్‌ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయన్న ఆయన, పరీక్షలపై విద్యార్థుల ఆందోళనను పరిగణించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఇక ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇవ్వాలన్నది కమిషన్‌ పరిధిలో లేదని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ప్రభుత్వం ఖాళీల వివరాలు స్పష్టంచేస్తే నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. వారంలోగా సిలబస్‌ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నివేదికపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టంచేశారు. ఖాళీలను బట్టి నియామకాల ప్రకటన ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమం, రాష్ట్రంపై అవగాహన ఉన్న వారి సేవలతో రిపోర్టును రూపొందించినట్టు వెల్లడించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలు విద్యార్థులు తెలుసుకునేలా ఈ రిపోర్టు ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ రిపోర్టు అందజేసిన సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకటన జారీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు. పత్రికల్లో వచ్చినట్టు గ్రూప్‌-4లో వ్యాసాలుండవని స్పష్టం చేశారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ లేదా డిస్కిప్టివ్ర్‌ అనేది ప్రభుత్వం తెలుపుతుందని వెల్లడించారు.సిలబస్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ నేతృత్వంలోని సభ్యుల బృందం చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణికి సిలబస్‌ నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకుని సిలబస్‌, పరీక్ష విధానంలో స్వల్ప మార్పులే చేశామని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్‌లను జారీ చేయాలని కోరుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సిలబస్‌ కమిటీ, పరీక్షలకు సంబంధించి ఎటువంటి వదంతులను నమ్మొద్దని సూచించారు.  టీఎస్‌పీఎస్‌సీ సిలబస్‌ కమిటీ భేటీ ముగిసింది. మూడు వారాల పాటు పాత సిలబస్‌ను పరిశీలించామని, చారిత్రక మార్పుల మేరకు సిలబస్‌, పరీక్షల్లో స్వల్ప మార్పులు చేశామని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇవ్వాలని, రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి సూచించామని కోదండరాం తెలిపారు. గ్రూప్స్‌ పరీక్షలు ఆ/-జబెక్టివ్‌ విధానంలో ఉంటాయన్న ఆయన, పరీక్షలపై విద్యార్థుల ఆందోళనను పరిగణించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు.