సివిల్ సప్లై హమాలీల సమ్మె ప్రారంభం
కాగజ్‌నగర్,జూన్20(జనం సాక్షి ): ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక హమాలీలు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం ప్రతినిధి పెంటయ్య మాట్లాడుతూ హమాలీల కూలీ రేట్లు పెంచాలని, సంవత్సర బోనస్‌ను రూ. 4000 నుంచి 10,000 వేలకు పెంచాలని తదితర డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. సివిల్ సప్లై డీలర్లు, ఏఐటీయూసీ నాయకులు హమాలీల సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించారు.