సిసిఎస్ పెన్షన్ విధానం రద్దు చేయాల్సిందే
వరంగల్,అక్టోబర్31(జనంసాక్షి): ఉద్యోగలు సిసిఎస్ పెన్షన్ విధానం రద్దు కోరుతూ ఆందోళన ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) కేంద్రసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. దీనిపై ప్రభుత్వాలు స్పష్టమైన హావిూని ఇవ్వాల్సి ఉందన్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గతం లో 12రోజులు సమ్మె చేశారని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఎన్‌డిఎ ఉన్న దృష్ట్యా దేశంలోని 29రాష్ట్రాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య ఈ మేరకు డిమాండ్ చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల
వైఖరితో ఉన్నారని అన్నారు. మిగతా ఉద్యోగులతో సమానంగా 13ఏళ్లుగా సీపీఎస్ విధానంపై పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాడ్యూటీ చెల్లించాలని గతంలోనే ముఖ్యమంత్రిని కోరామన్నారు. అంతేకాకుండా సీపీఎస్ స్థానంలో పా త పెన్షన్ విధానం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలన్న ప్రతిపాదనకు కూడా సీఎం సుముఖత వ్యక్తం చేశారన్నారు. గతంలో పీఆర్సీ 43శాతం ప్రకటించి ఉద్యోగులకు మేలు చేసిందని, అయితే మళ్లీ పీఆర్సీ కమిటీ నియమించాలని సీఎం కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.